ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అఖిల్ డైరెక్టర్ గా వంశీ పైడిపల్లి?

Fri, Jan 08, 2016
వంశీ పైడిపల్లి
వంశీ పైడిపల్లి
అఖిల్ రెండో సినిమా దర్శకుడిగా ఇప్పుడు వంశీ పైడిపల్లి పేరు వినిపిస్తోంది. దాదాపుగా ఆయననే ఖరారు చేయవచ్చని అనుకుంటున్నారు. అఖిల్ మొదటి సినిమా పరాజయం పాలైనా, ఆయన రెండవ సినిమా ఎవరితో వుండనుందోననే విషయంపై అందరిలోనూ ఆసక్తి పెరుగుతూ వస్తోంది. ఇక ఈ రెండవ సినిమాకి కథానాయికగా ఎవరికి ఛాన్స్ దొరుకుతుందోననే విషయం పట్ల కూడా అంతా ఆతృత చూపుతూ వస్తున్నారు.

ఈ నేపథ్యంలో అక్కినేని నాగార్జున .. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తో కలిసి, అఖిల్ రెండవ సినిమాను నిర్మించనున్నాడనే వార్త ఒకటి కొన్ని రోజులుగా షికారు చేస్తోంది. ఈ సినిమాకి దర్శకుడిగా వంశీ పైడిపల్లిని తీసుకుందామనే ఆలోచనలో నాగార్జున ఉన్నట్టుగా చెబుతున్నారు. 'ఊపిరి' సినిమా ద్వారా వంశీ పైడిపల్లి టేకింగ్ స్టైల్ ను ప్రత్యక్షంగా చూసిన నాగార్జున, ఆయన వైపు మొగ్గు చూపుతున్నాడని అంటున్నారు. ఇక కథానాయికగా 'అలియా భట్' పేరు వినిపిస్తోంది. కరణ్ జోహార్ ఆమె పేరును సూచించినట్టు చెబుతున్నారు. సంక్రాంతి తరువాత ఈ సినిమాకి సంబంధించిన పనులు మొదలవుతాయట.
X

Feedback Form

Your IP address: 54.167.149.128
Movie News (Latest)