ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దేవిశ్రీ ప్రసాద్ కి జోడీగా సమంతా!

Fri, Jan 08, 2016
సమంతా
సమంతా
దేవిశ్రీప్రసాద్ కి జోడీగా సమంతాను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి ఆమె అంగీకరించే అవకాశాలు ఎక్కువగానే వున్నాయని అంటున్నారు. సంగీత దర్శకుడిగా కావలసినంత క్రేజ్ తెచ్చుకున్న దేవిశ్రీ, హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. సుకుమార్ దర్శకత్వంలో దిల్ రాజు ఈ సినిమాను నిర్మించనున్నాడు. ఈ సినిమాలో దేవిశ్రీకి జోడీగా ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే విషయంపై కొంతమంది కథానాయికల పేర్లను పరిశీలించారు.

చివరికి సమంతా అయితేనే దేవిశ్రీకి జోడీగా బాగా నప్పుతుందని భావించి, ఆమెతో సంప్రదింపులు మొదలుపెట్టినట్టు చెబుతున్నారు. తెలుగులో 'అ .. ఆ' .. ' బ్రహ్మోత్సవం' సినిమాల్లో సమంతా నటిస్తోంది. ఇక తమిళ్లోను వరుస సినిమాలతో ఆమె బిజీగా వుంది. అందువలన ఆమె ఈ సినిమాకి ఓకే చెబుతుందా? అనే సందేహాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ కి గల క్రేజ్ కారణంగా .. ఇది సుకుమార్ - దిల్ రాజుల సినిమా కావడం వలన ఆమె తప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని మరికొంతమంది అంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.161.168.87
Movie News (Latest)