ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

హేబా పటేల్ ముంగిట అవకాశాలు

Fri, Jan 08, 2016
హేబా పటేల్
హేబా పటేల్
ఒక్క సినిమా హిట్టయితే చాలు, ఇక్కడ హీరోయిన్ల జాతకాలు ఇట్టే మారిపోతాయి. అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేస్తాయి. 'కుమారి 21 ఎఫ్' సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన హేబా పటేల్ కి కూడా అలాగే అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ నటించిన 'నాన్నకు ప్రేమతో' సినిమాలో ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ పోషించిన ఈ ముద్దుగుమ్మ, మరోపక్క జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు, రాజ్ తరుణ్ హీరోలుగా నటించే చిత్రంలో కూడా కథానాయికగా నటిస్తోంది.

తాజాగా నిఖిల్ సరసన నటించే ఛాన్స్ కూడా ఈ చిన్నదానికి వచ్చింది. వీఐ ఆనంద్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. ఇందులో నటించే ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా ఇప్పటికే అవికా గోర్ ఎంపిక కాగా, మరో కథానాయికగా హేబా పటేల్ ఎంపికైంది. ఈ విషయాన్ని దర్శకుడు ఆనంద్ తెలిపాడు. ఈ నెల 20 నుంచి ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. మొత్తానికి హేబా టాలీవుడ్ లో దూసుకుపోయేలా కనిపిస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.157.225.99
Movie News (Latest)