ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'సరైనోడు'లో దిశా పటాని ఐటెం పాట

Thu, Jan 07, 2016
దిశా పటాని
దిశా పటాని
దిశా పటాని పేరు వినగానే 'లోఫర్' సినిమా గుర్తుకువస్తుంది. ఆ సినిమాలో ఆమె గ్లామర్ తళుకులు కళ్లముందు కదలాడతాయి. అలాంటి దిశా పటాని .. 'సరైనోడు' సినిమాలో ఒక ఐటెమ్ లో బన్నీతో కలిసి స్టెప్పులు వేయనున్నట్టుగా తెలుస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'సరైనోడు' సినిమా చకచకా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో బన్నీ సరసన కథానాయికలుగా రకుల్ ప్రీత్ సింగ్ .. కేథరిన్ అలరించనున్నారు.

ఈ సినిమాలో అదిరిపోయే ఐటెమ్ సాంగ్ ఒకటి ఉందనీ, ఆ సాంగ్ ని అంజలితో చేయిస్తారనే వార్త ఒకటి ఇటీవల షికారు చేసింది. కానీ ఈ సినిమా టీమ్ దిశా పటానితో ఈ ఐటెమ్ సాంగ్ చేయించాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు. త్వరలోనే ఈ ఐటెమ్ సాంగ్ ను చిత్రీకరిస్తారట. బన్నీతో ఐటెమ్ సాంగ్ కి డాన్స్ చేయడమంటే మాటలు కాదు .. మరి దిశా పటాని ఆయన స్పీడును ఎలా అందుకుంటుందో .. ఫ్యాన్స్ ను ఎలా మెప్పిస్తుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.147.212.136
Movie News (Latest)