ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సుకుమార్ మూవీలో కొత్త హీరో!

Thu, Jan 07, 2016
సుకుమార్
సుకుమార్
లవ్ .. సెంటిమెంట్ .. యాక్షన్ .. ఎమోషన్ లను సమపాళ్లలో కలిపి తెరపై అందంగా ఆవిష్కరించే దర్శకుడిగా సుకుమార్ మంచి మార్కులు కొట్టేశాడు. అలాంటి సుకుమార్ త్వరలో ఒక కొత్త హీరోను తెరకి పరిచయం చేయనున్నాడనే టాక్ వినిపిస్తోంది. తన సోదరుడి కుమారుడైన అశోక్ ను .. తన సొంత బ్యానర్ ద్వారా హీరోగా పరిచయం చేయడానికి ఆయన రెడీ అవుతున్నాడని అంటున్నారు.

సుకుమార్ కి డైరెక్షన్లో మాత్రమే కాదు .. కథ - స్క్రీన్ ప్లే పైనా మంచి పట్టు వుంది. ఇక యూత్ ను కట్టిపడేసే కంటెంట్ ఎలా వుండాలనేది ఆయనకి బాగా తెలుసు. ఈ నేపథ్యంలోనే ఆయన నిర్మాతగా మారి, 'కుమారి 21 F' సినిమాను అందించి హిట్ కొట్టాడు. ఈ సినిమాకి ఆయన అందించిన కథ - స్క్రీన్ ప్లే ప్రాణంగా నిలిచాయి. అలాగే ఆయన తన సొంత బ్యానర్ పై రెండో సినిమాను నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకి కూడా తనే కథ - స్క్రీన్ ప్లే ను అందిస్తూ .. తన సోదరుడి కొడుకును హీరోగా పరిచయం చేస్తున్నాడు. మరి ఈ సినిమాకి ఆయన దర్శకత్వం వహిస్తాడా .. మరో దర్శకుడికి అప్పగిస్తాడా? అనేది చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.205.54.215
Movie News (Latest)