ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నెగిటివ్ పాత్రలో రాయ్ లక్ష్మీ!

Tue, Jan 05, 2016
రాయ్ లక్ష్మీ
రాయ్ లక్ష్మీ
రాయ్ లక్ష్మీ ఒక నెగిటివ్ పాత్రలో కనిపించనుంది. ఈ పాత్ర నటిగా తనకి మంచి గుర్తింపు తీసుకువస్తుందనే నమ్మకంతో ఆమె వుంది. ఆమెకి ఈ ఛాన్స్ దొరికింది మలయాళ స్టార్ మమ్ముట్టి సినిమాలో. రాయ్ లక్ష్మీ తనకి వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా తన ప్రతిభను ఆవిష్కరించే సినిమాలను అంగీకరిస్తూ వెళుతోంది. తెలుగులో 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించిన ఆమె, ఒక హిందీ సినిమాను కూడా చక్కబెట్టే ప్రయత్నంలో వుంది.

ఈ నేపథ్యంలోనే ఆమెకి ఒక మలయాళ చిత్రంలో అవకాశం వచ్చింది. మమ్ముట్టి కథానాయకుడిగా తెరకెక్కనున్న ఈ సినిమాకి నితిన్ రెంజి పానికర్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాలో మమ్ముట్టి పోలీస్ ఆఫీసర్ గా నటించనుండగా .. నెగిటివ్ పాత్రలో రాయ్ లక్ష్మీ కనిపించనుంది. విభిన్నమైన ఈ పాత్ర తనకి మంచి పేరును .. మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతుందని రాయ్ లక్ష్మీ భావిస్తోంది. ఐదవసారి మమ్ముట్టితో కలిసి నటించే ఛాన్స్ రావడం నిజంగా తన అదృష్టమంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.87.119.171
Movie News (Latest)