ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

29న రాజ్ తరుణ్ మూవీ రిలీజ్!

Tue, Jan 05, 2016
రాజ్ తరుణ్
రాజ్ తరుణ్
కుర్ర కథానాయకులలో రాజ్ తరుణ్ కి ఇప్పుడు ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. వరుస సక్సెస్ లతో ఆయన యూత్ నే కాదు, దర్శక నిర్మాతలను .. డిస్ట్రిబ్యూటర్స్ ను కూడా తనవైపుకు తిప్పుకున్నాడు. ఇటీవల ఆయన నటించిన 'కుమారి 21F' కూడా ఘనవిజయాన్ని సాధించడంతో, ఆయన తాజా చిత్రం 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో వేడుకను ఈ నెల 10న నిర్వహించాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారట. అలాగే ఈ సినిమాను ఈ నెల 29న విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. ముందు ఈ సినిమాను సంక్రాంతికి కాస్త దగ్గరలోనే రిలీజ్ చేయాలని అనుకున్నారట. కానీ పెద్ద సినిమాలు వరుసగా రంగంలోకి దిగడంతో, జనవరి 29కి వెళ్లడం జరిగిందని అంటున్నారు. హ్యాట్రిక్ హీరో అనిపించుకున్న రాజ్ తరుణ్ కి, కొత్త సంవత్సరంలో వస్తోన్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.163.166.22
Movie News (Latest)