ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అంజలికి మరో పెద్ద ఆఫర్

Tue, Jan 05, 2016
అంజలి
అంజలి
తాజాగా తెలుగులో నందమూరి బాలకృష్ణ సరసన 'డిక్టేటర్' చిత్రంలో నటించిన కథానాయిక అంజలి, ఇప్పుడు మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి పక్కన నటించే అవకాశాన్ని కూడా అందుకుంది. చాలా కాలం తర్వాత మలయాళ హీరో మమ్ముట్టి ఓ తమిళ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో కథానాయికగా అంజలిని ఎంచుకున్నారు. యువ దర్శకుడు రామ్ రూపొందిస్తున్న ఈ చిత్రం పేరు 'పేరున్బు'. ఇందులో మమ్ముట్టి ఓ బిడ్డకు తండ్రిగా నటిస్తున్నాడు. అంజలి కథానాయికగా నటిస్తున్నప్పటికీ, మమ్ముట్టికి భార్య మాత్రం కాదని, వీరి మధ్య బంధం ఏమిటన్నది ఆసక్తికరంగా సాగుతుందని దర్శకుడు చెబుతున్నాడు. కొడైకెనాల్, చెన్నయ్ లలో ఈ చిత్రం షూటింగును నిర్వహిస్తారు.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)