ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహేశ్ సినిమా టైటిల్ అది కాదట!

Mon, Jan 04, 2016
మహేశ్ బాబు
మహేశ్ బాబు
ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు ఓ చిత్రంలో నటించనున్న సంగతి విదితమే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ బడ్జెట్టుతో రూపొందే ఈ చిత్రానికి 'ఎనిమీ' అనే టైటిల్ నిర్ణయించినట్టు ఇటీవల మీడియాలో వార్తలొచ్చాయి. అయితే, అందులో ఏమాత్రం వాస్తవం లేదని దర్శకుడు మురుగదాస్ తాజాగా ప్రకటించాడు. ఈ సినిమాకు 'ఎనిమీ' అనే పేరు పెడుతున్నామని మీడియాలో వచ్చిన వార్తలు చూశానని, అయితే, అది వాస్తవం కాదని, అసలు ఇంకా ఏ టైటిలూ అనుకోలేదని ఆయన చెప్పాడు.
అలాగే, ఇందులో మహేశ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడన్న ప్రచారంలో కూడా వాస్తవం లేదని మురుగదాస్ చెప్పాడు. కాగా, ప్రస్తుతం ఈ దర్శకుడు హిందీలో సోనాక్షి సిన్హా కథానాయికగా 'అకీరా' పేరిట ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. దీని తర్వాత మహేశ్ నటించే చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు.
X

Feedback Form

Your IP address: 54.158.119.60
Movie News (Latest)