ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

హిందీ రీమేక్ దిశగా ' ఓకే బంగారం'

Thu, Dec 31, 2015
కరణ్ జోహార్
కరణ్ జోహార్
ఈ ఏడాది 'ఓకే బంగారం' అందించిన విజయాన్ని మణిరత్నం గానీ .. ఆయన అభిమానులుగాని మరిచిపోలేరు. అలాంటి ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. షాద్ అలీ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించడానికి కరణ్ జోహార్ రంగంలోకి దిగాడని చెబుతున్నారు.

తమిళ్లో నిత్యామీనన్ .. దుల్కర్ సల్మాన్ జంటగా నటించిన 'ఓకే కన్మణి' చిత్రం అక్కడ భారీ విజయాన్ని సాధించింది. తెలుగులో 'ఓకే బంగారం' పేరుతో మంచి వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని మణిరత్నం భావించాడు. ఆ తరువాత ఆయన ఆ ఆలోచనను విరమించుకున్నాడనే వార్తలు షికారు చేశాయి. ఇప్పుడు ఈ సినిమాను షాద్ అలీ దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మించనున్నాడు. ఆదిత్యరాయ్ కపూర్ .. శ్రద్ధా కపూర్ జంటగా సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకి, ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తూ వుండటం విశేషం.
X

Feedback Form

Your IP address: 54.205.89.199
Movie News (Latest)