ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహేశ్ న్యూ మూవీ కోసం మరో టైటిల్!

Wed, Dec 30, 2015
మహేశ్ బాబు
మహేశ్ బాబు
మహేశ్ బాబు కథానాయకుడిగా ఒక వైపున 'బ్రహ్మోత్సవం' సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే, మరో వైపున మురుగదాస్ తో ఆయన చేయనున్న సినిమాకి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసుకున్న ఈ సినిమా, ఏప్రిల్ లో సెట్స్ పైకి వెళ్లనుంది.

ఈ సినిమా టైటిల్ పట్ల మహేశ్ అభిమానులు ఆసక్తిని చూపుతూ వస్తున్నారు. దాంతో 'చట్టంతో పోరాటం' అనే టైటిల్ పెట్టే అవకాశం ఉందంటూ ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఆ టైటిల్ పెట్టకపోవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. ఇక తాజాగా ఈ సినిమాకి 'ఎనిమి' అనే టైటిల్ ను దర్శక నిర్మాతలు పరిశీలిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదే టైటిల్ ను ఖరారు చేస్తారా? లేదా? అనే విషయంలో త్వరలో స్పష్టత వచ్చే అవకాశం వుంది. తెలుగు .. తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో కథానాయికగా శ్రద్ధా కపూర్ పేరు వినిపిస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.147.238.62
Movie News (Latest)