ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

త్వరలోనే సెట్స్ పైకి చిరూ సినిమా!

Mon, Dec 28, 2015
చిరంజీవి
చిరంజీవి
త్వరలోనే చిరంజీవి 150వ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. చాలా కథలను పరిశీలించిన చిరంజీవి, తన 150వ సినిమాకి 'కత్తి' రీమేక్ అయితేనే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చేశారు. ఆ కథలో చిరూ చెప్పిన మార్పులు చేస్తూ, స్క్రిప్టు వర్క్ పర్యవేక్షణలో వినాయక్ బిజీగా వున్నాడు.

ఒక వైపున తన సినిమా 'తని ఒరువన్' రీమేక్ వ్యవహారాలు చూసుకుంటూనే, మరో వైపున చిరూ 150వ సినిమాకి సంబంధించిన పనులను చరణ్ దగ్గరుండి చూసుకుంటున్నాడు. చిరూ 150వ సినిమాను జనవరి చివరివారంలో లాంచ్ చేయాలనే ఆలోచనలో వున్నారు. ఫిబ్రవరి 2వ వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఇటు చిరూ సినిమా .. అటు చరణ్ సినిమా రీమేక్ లే కావడం, ఈ రెండు ఒకేసారి సెట్స్ పైకి వెళుతుండటం విశేషం.
X

Feedback Form

Your IP address: 54.204.108.121
Movie News (Latest)