ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహేశ్ ఆ సినిమా చూస్తాడట!

Sun, Dec 27, 2015
మహేశ్
మహేశ్
తన బావ నటించిన 'భలే మంచిరోజు' చిత్రానికి మంచి టాక్ వచ్చినందుకు మహేశ్ బాబు చాలా హ్యాపీగా వున్నాడు. ఆ విషయం అతని ట్వీట్లలో కనిపిస్తోంది. ప్రస్తుతం ఫ్యామిలీతో కలసి మహేశ్ 'న్యూఇయర్' సెలెబ్రేషన్స్ కోసం టూర్ లో వున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దుబాయ్ లో హాలిడే ఎంజాయ్ చేస్తున్న మహేశ్ తాజాగా ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు.
"భలే మంచిరోజు చిత్రానికి మంచి రివ్యూస్ వస్తున్నట్టు వింటున్నాను. నేను ఇండియాకు వచ్చాక ఈ చిత్రాన్ని చూస్తాను. ఈ సందర్భంగా సుధీర్ బాబుకి, టీమ్ అందరికీ కంగ్రాట్స్" అంటూ ట్వీట్ చేశాడు. మొదటి నుంచీ మహేశ్ తన బావ చిత్రాలను బాగా ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఫారిన్ టూర్ లో వుండి కూడా ఇలా ట్వీట్ చేయడం ఆ సినిమాకు మరింత ప్రచారాన్నిస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.167.149.128
Movie News (Latest)