ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'రాజుగారి గది'కి సీక్వెల్!

Sun, Dec 27, 2015
'రాజుగారి గది'కి సీక్వెల్ రానున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా దర్శకుడు ఓంకార్ అందుకు సంబంధించిన సన్నాహాలు చేస్తున్నట్టుగా సమాచారం. బుల్లితెర యాంకర్ గా క్రేజ్ తెచ్చుకున్న ఓంకార్ .. తన తమ్ముడిని హీరోగా పెట్టి 'రాజుగారి గది' సినిమాని తెరకెక్కించాడు.

సస్పెన్స్ .. హారర్ .. కామెడీ కలగలిపి ఆయన అందించిన వినోదానికి మంచి మార్కులు పడ్డాయి. యూత్ ఈ సినిమాను అనూహ్యమైన రీతిలో రిసీవ్ చేసుకుని విజయాన్ని కట్టబెట్టింది. ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. దాంతో ఓంకార్ ఈ సినిమాకు సీక్వెల్ చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. ప్రస్తుతం ఈ సీక్వెల్ కి సంబంధించిన కథపై కసరత్తు చేస్తున్నాడట. మొదటిభాగంలో నటించిన నటీనటులే రెండవభాగంలోను కనిపిస్తారు. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే ఈ సీక్వెల్ కి సాయికొర్రపాటి నిర్మాతగా వ్యవహరించే అవకాశం వుందని అంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.163.166.22
Movie News (Latest)