ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేసిన ఐశ్వర్య!

Sat, Dec 26, 2015
ఐశ్వర్య రాయ్
ఐశ్వర్య రాయ్
షూటింగుకి అంతరాయం కలిగించవద్దంటూ, తనని చూడటానికి వచ్చిన ఫ్యాన్స్ ను అందాల ఐశ్వర్యరాయ్ రిక్వెస్ట్ చేసింది. అంతే, ఆమె ఫ్యాన్స్ షూటింగ్ స్పాట్ నుంచి సైలెంట్ గా వెనుదిరిగారు. ఐశ్వర్యరాయ్ 'సరబ్ జిత్' అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ లో ఖైదు చేయబడి అక్కడే చనిపోయిన సరబ్ జిత్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని, దర్శకుడు ఒమంగ్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఇందులో సరబ్ జిత్ సోదరి పాత్రలో ఐశ్వర్యరాయ్ నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె డీ గ్లామరైజ్డ్ పాత్రలో ఎవరూ గుర్తుపట్టలేనంతగా కనిపిస్తుందట. ఆమెను ఎవరూ పెద్దగా గుర్తుపట్టరనే ఉద్దేశంతోనే దర్శకుడు ఈ సినిమా షూటింగును ముంబైకి దూరంగా పెట్టుకున్నాడు. అయితే ఇందులో ఐశ్వర్య నటిస్తోందని తెలుసుకున్న అభిమానులు, వందల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. షూటింగుకి అంతరాయం కలగడంతో, తమని ప్రశాంతంగా షూటింగ్ చేసుకోనివ్వమని ఐశ్వర్యరాయ్ అభిమానులను రిక్వెస్ట్ చేసిందట. వాళ్లు ఆమె మాటను గౌరవిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో, తిరిగి షూటింగ్ మొదలైందని అంటున్నారు.
X

Feedback Form

Your IP address: 184.73.107.18
Movie News (Latest)