ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తెలుగు నేర్చుకుంటోన్న స్టార్ హీరో!

Fri, Dec 25, 2015
మోహన్ లాల్
మోహన్ లాల్
మలయాళంలో సూపర్ స్టార్ అనిపించుకున్న మోహన్ లాల్ కి ఇటీవల తెలుగు నుంచి అవకాశాలు ఎక్కువగా వెళుతున్నాయి. వాటిలో ఆయన రెండు సినిమాలకు ఓకే చెప్పాడు. ఒక సినిమాలో ఆయన గౌతమి భర్తగా నటిస్తున్నాడు. 'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్ తండ్రిగా నటించనున్నాడు. గతంలో మోహన్ లాల్ ఒక్క తెలుగు సినిమాలో మాత్రమే నటించాడు. అందువలన ఆయనకి తెలుగు భాషపై అవగాహన తక్కువ.

తెలుగు సినిమాల్లో అవకాశాలు ఎక్కువగా వస్తుండటం .. రెండు సినిమాల్లో నటించడానికి సిద్ధపడటంతో ఆయన తెలుగు భాష నేర్చుకోవాలనే పట్టుదలతో ఉన్నాడట. తెలుగు బాగా తెలిసిన ఒక వ్యక్తి దగ్గర ఆయన తెలుగు నేర్చుకునే పనిలో ఉన్నాడని అంటున్నారు. ఇటీవల తెలుగు తెరకి పరిచయమవుతున్న కథానాయికలతో పాటు, ఇతర భాషలలోని అగ్ర కథానాయకులు సైతం తెలుగు భాష నేర్చుకోవడానికి ఆసక్తిని కనబరుస్తూ వుండటం విశేషం.
X

Feedback Form

Your IP address: 54.147.211.117
Movie News (Latest)