ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రెడీ అవుతోన్న 'జనతా గ్యారేజ్'

Fri, Dec 25, 2015
ఎన్టీఆర్
ఎన్టీఆర్
ఒక వైపున ఎన్టీఆర్ నటిస్తోన్న 'నాన్నకు ప్రేమతో' సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంటూ ఉండగానే, మరో వైపున ఆయన తదుపరి సినిమాకు సన్నాహాలు జరిగిపోతున్నాయి. ఎన్టీఆర్ తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనుంది. 'జనతా గ్యారేజ్' పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాను ఫిబ్రవరి రెండవ వారంలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ .. ప్రీ ప్రొడక్షన్ పనులు చివరిదశకు చేరుకున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ మెకానిక్ గా కనిపించనున్నాడు. ఒక కీలకమైన పాత్ర కోసం మోహన్ లాల్ ను ఎంపిక చేసిన యూనిట్, కథానాయిక కోసం అన్వేషిస్తోంది. 'శ్రీమంతుడు' తరువాత మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తోన్న ఈ భారీ బడ్జెట్ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. 'శ్రీమంతుడు' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత కొరటాల చేస్తోన్న సినిమా కావడంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)