ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రవితేజ ఆ సినిమా మిస్సయ్యాడట!

Fri, Dec 25, 2015
రవితేజ
రవితేజ
ఒక బాలీవుడ్ సినిమాకి తెలుగు రీమేక్ చేయాలని ఉత్సాహపడిన రవితేజ, ఆ ఛాన్స్ మరొకరికి వెళ్లడంతో కాస్త నిరుత్సాహానికి లోనయ్యాడని తెలుస్తోంది. నీరజ్ పాండే దర్శకత్వంలో అక్షయ్ కుమార్ - కాజల్ జంటగా చేసిన 'స్పెషల్ 26' సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందింది. 2013వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమాను ఇటీవల హరీశ్ శంకర్ దర్శకత్వంలో చేయాలని రవితేజ ముచ్చట పడ్డాడట.

అయితే దక్షిణాది భాషలన్నింటిలోను ఈ సినిమా రైట్స్ ను హీరో ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ తీసుకున్నాడు. ప్రశాంత్ హీరోగా ఆయన ఈ సినిమాను 'ఇరుబది ఆరు' టైటిల్ తో తమిళ్ లో రీమేక్ చేస్తున్నాడు. తెలుగు .. కన్నడ .. మలయాళ భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమా ప్రశాంత్ కి భారీ హిట్ ను ఇస్తుందని ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. త్యాగరాజన్ తీసుకున్న ఈ నిర్ణయం వలన, ఈ సినిమా రీమేక్ లో చేయాలనే రవితేజ ఆశ నెరవేరకుండా అయిందని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.54.215
Movie News (Latest)