ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రకుల్ హవా తగ్గుతోందా?

Fri, Dec 25, 2015
రకుల్
రకుల్
చూస్తుంటే రకుల్ హవా తగ్గుతున్నట్టుగానే కనిపిస్తోంది. ఆమధ్య వరుసగా అగ్రకథానాయకుల సరసన ఛాన్స్ కొట్టేసిన రకుల్, 'సరైనోడు' తరువాత ఆ స్పీడును కంటిన్యూ చేయలేకపోతున్నట్టుగా అనిపిస్తోంది. చిన్న సినిమాలతో తన కెరియర్ ను ప్రారంభించిన రకుల్, తన గ్లామర్ తో యూత్ ను కట్టి పడేసింది. నయనతార .. అనుష్క .. త్రిష .. సమంతా తమిళ్ లో బిజీ కావడం వలన, ఇలియానా .. కాజల్ కి తెలుగులో అవకాశాలు తగ్గడం వలన రకుల్ కి కలిసొచ్చింది.

నాజూకు సౌందర్యంతో యూత్ నుంచి మార్కులు కొట్టేసిన రకుల్, చాలా తక్కువ సమయంలో అగ్రస్థానానికి చేరుకుంది. అయితే రవితేజతో చేసిన 'కిక్ 2' .. రామ్ చరణ్ తో చేసిన 'బ్రూస్ లీ' పరాజయం పాలయ్యాయి. దాంతో ఆమె 'నాన్నకు ప్రేమతో' పైనే ఆశలు పెట్టుకుంది. ఇక సెట్స్ పైన 'సరైనోడు' వుంది. ఈ సినిమాల తరువాత ఆమె కొత్త సినిమాలను అంగీకరించిన దాఖలాలు కనిపించడం లేదు. ఆమె హవా కొనసాగడమనేది ఈ రెండు సినిమాల సక్సెస్ పై ఆధారపడి వుంది.
X

Feedback Form

Your IP address: 54.205.43.70
Movie News (Latest)