ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మళ్లీ ఎంట్రీ ఇస్తోన్న సుమలత!

Thu, Dec 24, 2015
సుమలత
సుమలత
సుమలత .. తెలుగు తెరపై అందానికీ అభినయానికి అర్థం చెప్పిన కథానాయిక. ఆమె పేరు వినగానే ఖైదీ .. చట్టంతో పోరాటం .. శ్రుతిలయలు వంటి సినిమాలు కళ్లముందు కదలాడతాయి. అలాంటి సుమలత వివాహం తరువాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. ఆ తరువాత కొంతకాలానికి రాజకుమారుడు .. శ్రీమంజునాథ చిత్రాల్లో ముఖ్యమైన పాత్రలను ధరించింది.

అప్పటి నుంచి ఎక్కువగా టీవీ షోలకి మాత్రమే పరిమితమైన సుమలత, మరోసారి తెలుగు తెరపై కనిపించి అభిమానులకు ఆనందాన్ని కలిగించబోతోంది. అల్లు శిరీష్ - లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కుతోన్న సినిమాలో ఆమె ఒక కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాకి పరశురామ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలోని కీలకమైన పాత్రకు నిండుదనాన్ని తెచ్చే విధంగా సుమలత కనిపిస్తుందనీ, ఇకపై ఈ తరహా పాత్రల్లో ఆమె బిజీ కావడం ఖాయమని చెబుతున్నారు.
X

Feedback Form

Your IP address: 50.16.107.222
Movie News (Latest)