ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహేశ్, ప్రభాస్ ల హెల్ప్ మరిచిపోలేడట!

Thu, Dec 24, 2015
సుధీర్ బాబు
సుధీర్ బాబు
మహేశ్ బాబు .. ప్రభాస్ చేసిన హెల్ప్ ను ఎప్పటికీ మరిచిపోలేనని హీరో సుధీర్ బాబు చెప్పాడు. తన తాజా చిత్రం 'భలేమంచి రోజు' రేపు విడుదల కానున్న సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఇలా స్పందించాడు. మొదటినుంచి కూడా సుధీర్ బాబు కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. అలాగే ఆయన ఈ కథకు ఓకే చెప్పాడు. ఆయన స్నేహితులు విజయ్ .. శశి ఈ సినిమాను నిర్మిస్తూ వుండగా, శ్రీరామ్ ఆదిత్య దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

ఈ కథ చాలా సరదాగా సాగిపోతుందనీ .. ప్రేక్షకులకు ఎంతమాత్రం బోర్ కొట్టకుండా వినోదాన్ని అందిస్తుందని సుధీర్ బాబు చెప్పాడు. తనకి మహేశ్ ప్రోత్సాహం ఎంతో ఉందనీ, ఈ సినిమాతో స్టార్ హీరోను అవుతానని ఆయన చెప్పాడని అన్నాడు. అలాగే మొదటినుంచి ప్రభాస్ తమను సపోర్ట్ చేస్తూ వస్తున్నాడనీ, ఆయన సూచనలు .. సలహాలతో ముందుకు వెళ్లామని చెప్పాడు. ఈ ఇద్దరు స్టార్ హీరోలు అందించిన హెల్ప్ ను ఎప్పటికి మరిచిపోలేనంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
X

Feedback Form

Your IP address: 54.205.176.107
Movie News (Latest)