ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సంపత్ నంది చేతికి పవన్, దాసరి మూవీ?

Wed, Dec 23, 2015
సంపత్ నంది
సంపత్ నంది
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా తాను ఒక సినిమా నిర్మించనున్నట్టు కొంతకాలం క్రితం ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు ప్రకటించారు. ఆ సమయంలోనే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్టు వర్క్ మొదలైందనే వార్తలు వినిపించాయి. ఆ తరువాత ఈ విషయంపై ఎక్కడా సందడి కనిపించలేదు. తాజాగా మళ్లీ ఈ విషయంపై ఫిల్మ్ నగర్లో ఒక వార్త షికారు చేస్తోంది. దాసరి నారాయణరావు ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను సంపత్ నందికి అప్పగించినట్టు చెప్పుకుంటున్నారు.

ఈ ప్రాజెక్టు గురించి అటు పవన్ కల్యాణ్ తోను .. ఇటు సంపత్ నందితోను మాట్లాడి దాసరి నారాయణరావు ఈ నిర్ణయం తీసుకున్నారట. రచ్చ .. బెంగాల్ టైగర్ సినిమాలతో హిట్ కొట్టిన సంపత్ నంది, మాస్ ఆడియన్స్ పల్స్ పట్టేశాడనే నమ్మకంతోనే దాసరి నారాయణరావు ఆయనకి ఈ ప్రాజెక్టును అప్పగించి ఉండవచ్చని అనుకుంటున్నారు. ఈ విషయాన్ని గురించి సంక్రాంతికి దాసరి నారాయణరావు ఒక ప్రకటన చేయవచ్చని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.159.129.152
Movie News (Latest)