ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రజనీ కోసం అక్షయ్ అడ్జస్ట్ మెంట్!

Wed, Dec 23, 2015
అక్షయ్ కుమార్ - శంకర్
అక్షయ్ కుమార్ - శంకర్
రజనీకాంత్ - శంకర్ కాంబినేషన్లో వచ్చే సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ వుంటుంది. అలాంటి క్రేజ్ వున్న ప్రాజెక్టులో ఛాన్స్ వస్తే ఎవరు మాత్రం వదులుకుంటారు .. అవసరమైతే ఆ సినిమా కోసం మిగతా ప్రాజెక్టులను వాయిదా వేసుకుంటారు. అక్షయ్ కుమార్ కూడా అదే పని చేశాడట. 'రోబో 2.0' సినిమా కోసం ఆయన 'నమస్తే ఇంగ్లాండ్' సినిమాను వాయిదా వేసుకున్నాడని అంటున్నారు.

'రోబో 2.0'లో రజనీకి విలన్ గా ముందు హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ ను అనుకున్నారు. కొన్ని కారణాల వలన ఆయన తప్పుకోవడంతో, ఆ పాత్ర కోసం అక్షయ్ కుమార్ ను సంప్రదించారు. అయితే అప్పటికే విపుల్ షా దర్శకత్వంలో 'నమస్తే ఇంగ్లాండ్' సినిమా కోసం ఆయన 4 నెలల పాటు డేట్స్ ఇచ్చాడట. అయినా ఎంతమాత్రం దాని గురించి ఆలోచించకుండా ఆ సినిమాను వాయిదా వేసుకుని .. ఈ సినిమాకు ఓకే చెప్పాడట. ఈ సినిమా పట్ల గల క్రేజ్ కి ఇదొక ఉదాహరణగా చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 23.23.50.247
Movie News (Latest)