ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కామెడీ టచ్ ఇచ్చిన రెజీనా!

Wed, Dec 23, 2015
రెజీనా
రెజీనా
తెరపై చలాకీగా కనిపిస్తూ చక్కని అభినయాన్ని ఆవిష్కరించే కథానాయికలలో రెజీనా ఒకరు. గ్లామర్ పాత్రలు చేస్తూ వస్తోన్న రెజీనా .. ఈసారి గ్లామర్ తో పాటు కామెడీ టచ్ తో కూడిన పాత్రను చేసినట్టుగా చెబుతోంది. రేపు విడుదలవుతోన్న 'సౌఖ్యం' సినిమాను గురించి మాట్లాడుతూ ఆమె ఈ విషయం చెప్పింది. రెజీనా తన కెరియర్ స్పీడ్ ను పెంచుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో గోపీచంద్ సరసన 'సౌఖ్యం' సినిమా చేసింది.

ఇంతవరకూ తాను చేసిన పాత్రలకి భిన్నంగా ఈ సినిమాలో కనిపిస్తానని రెజీనా అంది. తన పాత్ర కామెడీ టచ్ తో కూడినదనీ .. కామెడీ చేయడం కొత్తే అయినా బాగానే చేశానని అనుకుంటున్నానని చెప్పింది. ఇక ఈ పాత్రను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారోనని ఆసక్తిగా వుందని అంది. వైవిధ్యభరితమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమాకి, ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందనే నమ్మకం ఉందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
X

Feedback Form

Your IP address: 54.147.211.117
Movie News (Latest)