ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అసిన్ పెళ్లికి ముహూర్తం కుదిరింది!

Wed, Dec 23, 2015
అసిన్
అసిన్
అసిన్ పెళ్లికి ముహూర్తం కుదిరింది ... కొత్త సంవత్సరం ఆరంభంలో ఆమె పెళ్లి కూతురు కాబోతోంది. జనవరి 23న ఆమె వివాహం రాహుల్ శర్మతో వైభవంగా జరగనుంది. తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా అసిన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత హిందీ సినిమాలకు ప్రాధాన్యతనిస్తూ ముంబైలో స్థిరపడింది. ఈ నేపథ్యంలోనే ఓ మొబైల్ కంపెనీకి చెందిన రాహుల్ శర్మతో ఆమె ప్రేమలో పడింది.

ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నది మొదలు, త్వరలో వీరి వివాహమంటూ వార్తలు షికారు చేస్తూనే వున్నాయి. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం జనవరి 23న వీరి వివాహం ఢిల్లీలో జరగనుంది. ఆ తరువాత ముంబైలో గ్రాండ్ గా రిసెప్షన్ ను ఏర్పాటు చేస్తున్నారట. 'గజిని' సినిమాలో మాదిరిగానే తన వివాహం ఓ మొబైల్ కంపెనీ యజమానితో జరుగుతుండటం పట్ల అసిన్ ఆనందాశ్చర్యాలను వ్యక్తం చేస్తోంది.
X

Feedback Form

Your IP address: 50.16.17.16
Movie News (Latest)