ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రజనీ మూవీ రిలీజ్ అప్పుడే!

Tue, Dec 22, 2015
రజనీకాంత్
రజనీకాంత్
'రోబో 2.0' సినిమా షూటింగ్ మొదలైంది .. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్లాన్ చేశారు. అయితే రజనీకాంత్ చేస్తోన్న 'కబాలి' సినిమా చివరి షెడ్యూల్ మిగిలే వుంది. ఈ షెడ్యూల్ ను జనవరి మొదటివారంలో మొదలుపెట్టి, ఆ నెల చివరికి పూర్తి చేయాలని ఈ సినిమా యూనిట్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఏప్రిల్ రెండవవారంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో దర్శకనిర్మాతలు వున్నారట.

రంజిత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రజనీ సరసన రాధికా ఆప్టే కథానాయికగా కనిపించనుంది. ఈ షెడ్యూల్ వరకూ రజనీకి సంబంధించిన సన్నివేశాలు ఏవైనా వుంటే, డేట్స్ ఎడ్జెస్ట్ చేసుకుని ఆయన ఈ సినిమాను పూర్తిచేయనున్నాడని అంటున్నారు. డిఫరెంట్ గెటప్స్ లో రజనీ కనిపించనున్న ఈ సినిమాపై అభిమానులు ఆసక్తితో వున్నారు. 'మహాదేవ్' పేరుతో ఈ సినిమా తెలుగులోను విడుదలకానున్న సంగతి తెలిసిందే.
X

Feedback Form

Your IP address: 54.87.119.171
Movie News (Latest)