ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'నాన్నకు ప్రేమతో' ఆడియోపై ఆసక్తి!

Tue, Dec 22, 2015
ఎన్టీఆర్
ఎన్టీఆర్
ఎన్టీఆర్ కథానాయకుడిగా రూపొందుతోన్న 'నాన్నకు ప్రేమతో' సినిమా ఆడియో వేడుకకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. జంగ్లీ మ్యూజిక్ వారు ఈ ఆడియో రైట్స్ ను సొంతం చేసుకున్నట్టు ప్రకటించారు. త్వరలోనే ఈ ఆడియో వేడుక జరగనుందని తెలియజేశారు. దేవిశ్రీప్రసాద్ స్వరపరచిన ఈ పాటలను ఈ నెల 27న విడుదల చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ ను .. ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ఆయన అభిమానుల టేస్టుకి తగినట్టుగా దేవిశ్రీప్రసాద్ ఈ బాణీలను సమకూర్చినట్టుగా చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ గెటప్ .. కథా కథనాలు .. పాటలు ఈ సినిమా హైలైట్స్ గా నిలుస్తాయని అంటున్నారు. ఎన్టీఆర్ కు జోడీగా రకుల్ నటిస్తోన్న ఈ సినిమాను, సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న విడుదల చేయనున్నారు. ఆ దిశగానే ఈ సినిమాకి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఆ తేదీ కోసమే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.159.197.114
Movie News (Latest)