ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రెజీనాతో బ్రహ్మానందం కామెడీ!

Mon, Dec 21, 2015
బ్రహ్మానందం
బ్రహ్మానందం
'సౌఖ్యం' సినిమాలో రెజీనా .. బ్రహ్మానందం కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్స్ కడుపుబ్బ నవ్విస్తాయని ఈ సినిమా నిర్మాత ఆనంద్ ప్రసాద్ చెప్పాడు. ఈ సినిమాలో వచ్చే ఈ సన్నివేశాలను ప్రేక్షకులు తలచుకుని మరీ నవ్వుకుంటారని ఆయన అన్నాడు.

'లౌక్యం' సినిమాలో పృథ్వీ - రకుల్ మధ్య చోటుచేసుకునే హాస్యభరితమైన సన్నివేశాలు ఆడియన్స్ ను ఎంతగానో అలరించాయనీ, అదే విధంగా ఈ సినిమాలో బ్రహ్మానందం - రెజీనా మధ్య వచ్చే సన్నివేశాలు ఆద్యంతం వినోదాన్ని అందిస్తాయని చెప్పాడు. ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యాక్షన్ తో పాటు కామెడీకి కూడా పెద్దపీట వేశామని అన్నాడు. ఇటీవల కాలంలో బ్రహ్మానందం కామెడీలో కొత్తదనం కనిపించడం లేదనీ, బోర్ కొడుతోందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో 'సౌఖ్యం' సినిమాలోని కామెడీ అయినా ఆ విమర్శలకు తెరదింపుతుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.159.239.251
Movie News (Latest)