ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆలోచనలో పడిన 'ఊపిరి' నిర్మాతలు!

Mon, Dec 21, 2015
'ఊపిరి' లో ఓ దృశ్యం
'ఊపిరి' లో ఓ దృశ్యం
'ఊపిరి' విడుదల విషయంలో ఈ సినిమా నిర్మాతలు ఆలోచనలో పడినట్టుగా తెలుస్తోంది. తెలుగు .. తమిళ భాషల్లో విడుదల సమయాలు కుదరకపోవడమే ఇందుకు కారణమని అంటున్నారు. నాగార్జున .. కార్తీ .. తమన్నా ప్రధాన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, వంశీ పైడిపల్లి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ప్రసాద్ వి.పొట్లూరి భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేస్తే బాగుంటుందని ముందుగా అనుకున్నారు. కానీ నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్నినాయన' సినిమా జనవరిలో విడుదలవుతుండటంతో, ఆ వెంటనే 'ఊపిరి'ని రిలీజ్ చేయడం బిజినెస్ పరంగా మంచిది కాదని నిర్మాతలు భావిస్తున్నారు. వేసవి సెలవులకి వాయిదా వేయాలనే వాళ్ల ఆలోచనకి కార్తి అడ్డుపడుతున్నాడట. ఆ సమయంలో తమిళ్లో రజనీకాంత్ .. అజిత్ సినిమాలు విడుదలకి ఉన్నాయనీ, అందువలన అప్పుడు రిలీజ్ చేయడం వలన వసూళ్ల పరంగా దెబ్బతినే అవకాశం వుందని అంటున్నాడని చెబుతున్నారు. మరిక నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.161.168.21
Movie News (Latest)