ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'బాహుబలి 2' విజువల్ ఎఫెక్ట్స్ పై ఆసక్తి!

Mon, Dec 21, 2015
ప్రభాస్
ప్రభాస్
'బాహుబలి 2' సినిమా షూటింగ్ మొదలుకావడంతో, అందరి దృష్టి ఆ వైపుకు మళ్లింది. రెండవ భాగానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి అంతా ఆసక్తిని చూపుతున్నారు. మొదటిభాగంలో విజువల్ ఎఫెక్ట్స్ ఒక రేంజ్ లో ఉండటంతో, ఆడియన్స్ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. తాము ఒక ప్రత్యేకమైన ప్రపంచంలో వున్న అనుభూతిని పొందారు. అవతార్ .. లైఫ్ ఆఫ్ పై వంటి హాలీవుడ్ చిత్రాలతో ఈ సినిమాను పోల్చారు.

అయితే గ్రాఫిక్స్ పరంగా ఆ సినిమాలతో పోల్చుకుంటే, చాలా తక్కువ బడ్జెట్ లో ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ చేశామని ఇటీవల ఒక సందర్భంలో రాజమౌళి అన్నాడు. విజువల్ ఎఫెక్ట్స్ ను 22 కోట్లతోనే పూర్తి చేశామనీ, ఆ మాత్రం ఖర్చుతో ఆడియన్స్ ను మెప్పించగలిగినందుకు చాలా గర్వంగా అనిపించిందని ఆయన చెప్పాడు. మరి 'బాహుబలి 2' విషయంలో ఆయన మరింత శ్రద్ధ పెట్టినట్టుగా వార్తలు వెలువడుతోన్న నేపథ్యంలో, ఈసారి విజువల్ ఎఫెక్ట్స్ కి ఏ రేంజ్ లో ఖర్చుచేస్తారోననే విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
X

Feedback Form

Your IP address: 54.205.87.3
Movie News (Latest)