ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

డ్యూయెల్ రోల్ లో రవితేజ!

Fri, Dec 18, 2015
రవితేజ
రవితేజ
సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ ఒక సినిమాలో ద్విపాత్రాభినయం చేయబోతున్నాడనే వార్త కొన్ని రోజులుగా షికారు చేస్తూ వస్తోంది. దాంతో ఆ పాత్రల తీరుతెన్నులు తెలుసుకోవాలని ఆయన అభిమానులు ఆతృతపడుతున్నారు. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం .. ఈ సినిమాలో ఆయన 20 యేళ్ల యువకుడిగాను .. 50 యేళ్ల వయసు కలిగిన వాడిగాను కనిపిస్తాడట. ఈ తరహా పాత్రలను రవితేజ పోషించడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు.

ఈ సినిమాలో యువకుడిగా కనిపించడానికి రవితేజ చాలా జాగ్రత్తలు తీసుకోనున్నాడట. అలాగే రెండు నెలల గ్యాప్ తీసుకుని వయసుమళ్లిన వ్యక్తిగా కనిపించేందుకుగాను తగిన కసరత్తు చేస్తాడని అంటున్నారు. అయితే .. వేణుశ్రీరామ్ .. చక్రి దర్శకత్వంలోని సినిమాలను పూర్తిచేసిన తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. స్వామిరారా .. దోచేయ్ సినిమాలతో యూత్ ను అలరించిన సుధీర్ వర్మ, ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ ను పూర్తిచేసే పనిలో వున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.167.142.229
Movie News (Latest)