ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఫ్యామిలీలకు 'బ్రహ్మోత్సవంలో' ఛాన్స్!

Thu, Dec 17, 2015
సహజంగానే 'బ్రహ్మోత్సవం' చూస్తుంటే ఎవరికైనా ఒళ్లు పులకరిస్తుంది. ఆ పండుగ వాతావరణంలో అలాగే ఉండిపోవాలనిపిస్తుంటుంది. ప్రేమానురాగాలతో కలిపి అలాంటి సందడిని ఆవిష్కరించేదిగా 'బ్రహ్మోత్సవం' సినిమా రూపొందుతోంది. మహేశ్ బాబు సినిమా అనగానే ఆ సినిమాలో కనిపించే అవకాశం వస్తే అంతకు మించిన అదృష్టం లేదని చాలామంది అనుకుంటూ వుంటారు. అలాంటి వాళ్ల కలను నిజం చేయడానికి 'బ్రహ్మోత్సవం' టీమ్ ఒక అవకాశాన్ని ఇస్తోంది.

వయసుతో సంబంధం లేకుండా ఫ్యామిలీతో సహా ఈ సినిమాలో కనిపించవచ్చు. అలా మహేశ్ సినిమాలో కనిపించాలనే ఆసక్తిగలిగిన వాళ్లు, తమను సంప్రదించవలసిన చిరునామాతో పాటు, ఫ్యామిలీ ఫోటోలను రెండు పంపించవలసి వుంటుంది. ఆ వివరాలను pvpcinema@pvpglobal.com అనే మెయిల్ ఐడికి పంపించవలసినదిగా ఈ సినిమా టీమ్ కోరుతోంది.
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)