ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఎన్టీఆర్ ఆడియో రిలీజ్ డేట్ పై సందిగ్ధం!

Wed, Dec 16, 2015
ఎన్టీఆర్
ఎన్టీఆర్
'నాన్నకు ప్రేమతో' సినిమా ఆడియో రిలీజ్ డేట్ పై అందరిలోనూ సందిగ్ధం నెలకొంది. ముందుగా చెప్పిన ప్రకారం ఈ ఆడియో వేడుక జరుగుతుందా .. లేదా? అనే సందేహం వాళ్లకి కలుగుతోంది. ఈ సినిమాకి సంగీతం అందిస్తోన్న దేవిశ్రీప్రసాద్, తండ్రి చనిపోయిన బాధలో ఉండటమే అందుకు కారణమని తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ - రకుల్ జంటగా నటిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు.

ఈ లోగా ఈ నెల 25న పాటలను ఆవిష్కరించాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ ఇంకా ఒక పాటను కంపోజ్ చేయవలసి వుందట. ఈ నేపథ్యంలో హఠాత్తుగా ఆయన తండ్రి చనిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో 'నాన్నకు ప్రేమతో' ఆడియో వేడుక జరుగుతుందా .. వాయిదా పడుతుందా? అనే విషయంపై అందరిలోనూ సందేహం తలెత్తుతోంది. మరిక ఏం జరుగుతుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.158.167.137
Movie News (Latest)