ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చిరూతో డాన్స్ చేయాలని వుందట!

Wed, Dec 16, 2015
తమన్నా
తమన్నా
చిరంజీవితో డాన్స్ చేయాలని కథానాయిక తమన్నా ముచ్చట పడుతున్నట్టుగా ఒక వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ఆయనతో కలిసి స్టెప్పులు వేయాలని ఆసక్తిగా ఉందనే సంకేతాలను ఆమె పంపుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. చిరంజీవి 150వ సినిమా 'కత్తి' రీమేక్ అనీ .. చరణ్ నిర్మాణంలో ఈ సినిమాను వినాయక్ తెరకెక్కిస్తాడనే విషయం స్పష్టమైంది. అప్పటి నుంచి ఈ సినిమాలో చిరూతో కలిసి ఒక పాటలో డాన్స్ చేసినా చాలని తమన్నా భావిస్తోందని అంటున్నారు.

గతంలో ఆమె పవన్ .. చరణ్ .. అల్లు అర్జున్ లతో కలిసి తెరపై సందడి చేసింది. ఇక మెగాస్టార్ తోను కనిపించి, అరుదైన రికార్డును సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆమె వుందని అనుకుంటున్నారు. 'రచ్చ' సినిమా ఫంక్షన్లో చిరంజీవి ఆమె డాన్స్ కి కితాబును ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఆమెతో కలిసి స్టెప్స్ వేయాలని వుందని కూడా ఆయన అన్నారు. అందువలన తమన్నా ముచ్చట తీరే అవకాశం లేకపోలేదని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)