ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

శ్రుతిహాసన్ తో సాంగేసుకుంటోన్న చైతూ!

Tue, Dec 15, 2015
నాగచైతన్య
నాగచైతన్య
శ్రుతిహాసన్ తో కలిసి కాలేజ్ క్యాంపస్ లోనే చైతూ పాట పాడుకుంటున్నాడు. ఆమె పట్ల తనకి గల ప్రేమను ఆ పాట ద్వారా అందంగా వ్యక్తం చేస్తున్నాడు. 'ప్రేమమ్' రీమేక్ కోసం ఆ దృశ్యాలను దర్శకుడు చందూ మొండేటి చక్కగా చిత్రీకరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతోంది.

ఈ సినిమాలో నాగచైతన్యకి లెక్చరర్ గా శ్రుతిహాసన్ నటిస్తోంది. అయినా ఆమెను అతను ఆరాధిస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో వచ్చే పాట కావడం వలన, వైజాగ్ లోని ఒక విద్యాలయంలో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. నైట్ ఎఫెక్ట్ కి సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించడంలో టీమ్ బిజీగా వుంది. ఈ నెల 17 వరకూ కొనసాగే షూటింగ్ తో ఈ షెడ్యూల్ పూర్తికానుంది. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ రెండవ కథానాయికగా నటిస్తుండగా, మూడవ కథానాయికగా రెజీనా పేరు వినిపిస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.161.128.52
Movie News (Latest)