ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

హీరోయిన్ గా రాజశేఖర్ కూతురు ఎంట్రీ!

Mon, Dec 14, 2015
తండ్రితో శివాని
తండ్రితో శివాని
తెలుగు తెరపై యాంగ్రీ యంగ్ మేన్ అనిపించుకున్న రాజశేఖర్, తన కూతురును కథానాయికగా పరిచయం చేయడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. 'వందకు వంద' అనే సినిమా ద్వారా ఆమె కథానాయికగా అరంగేట్రం చేయనున్నట్టు సమాచారం. ఈ మధ్య విలన్ పాత్రలను పోషించడానికి రాజశేఖర్ నిర్ణయించుకున్నట్టుగా వార్తలు షికారు చేశాయి. ఆయన విలన్ గా కనిపించేది కథానాయికగా కూతురు నటించనున్న ఈ సినిమాలోనే నట!

కథానాయకుడిగా ఎన్నో హిట్లు అందుకున్న రాజశేఖర్, ఇలా విలన్ గా తన కూతురు సినిమా ద్వారా పరిచయం అవుతుండటం విశేషం. ఈ సినిమా హిట్ కొడితే .. జగపతిబాబు మాదిరిగా ఆయన విలన్ పాత్రల్లోను బిజీ అయ్యే ఛాన్స్ వుంది. ఇక తమిళ్లో శరత్ కుమార్ .. అర్జున్ వంటి కథానాయకుల కూతుర్లు తండ్రి సపోర్ట్ తో హీరోయిన్లుగా రాణిస్తున్నారు. అదే తరహాలో రాజశేఖర్ కూతురు శివాని కూడా రాణిస్తుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.159.197.114
Movie News (Latest)