ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నాన్ స్టాప్ గా దూసుకెళ్లనున్న 'సర్దార్'

Mon, Dec 14, 2015
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
'సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగ్ నాన్ స్టాప్ గా కొనసాగనుందని తెలుస్తోంది. షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తికావడానికీ, విడుదల కావడానికి గాను ఈ సినిమా యూనిట్ తో కలిసి పవన్ ప్లాన్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ ప్రణాళిక ప్రకారం ఈ నెల 28 నుంచి ఆదివారాలు మినహా ప్రతిరోజు పవన్ షూటింగులో పాల్గొంటాడని అంటున్నారు.

'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం అయింది. ఆ తరువాత కొన్ని కారణాల వలన మరింత జాప్యం జరిగింది. ఇక ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన పనులు వేగవంతమయ్యాయి. అయితే ఇంకాస్త స్పీడ్ పెంచవలసిన అవసరం వుందని భావించిన పవన్, 70 రోజుల పాటు నాన్ స్టాప్ గా ఈ సినిమా షూటింగులో పాల్గొని అనుకున్న సమయానికి పూర్తిచేయాలని నిర్ణయించుకున్నాడట. ప్రస్తుతం ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.
X

Feedback Form

Your IP address: 54.161.208.7
Movie News (Latest)