ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కార్తీకి జోడీగా నిత్యామీనన్!

Mon, Dec 14, 2015
నిత్యామీనన్
నిత్యామీనన్
కార్తీకి జోడీగా నిత్యామీనన్ నటించనుంది .. ఈ సినిమా ద్వారా ఆమె మరోమారు మణిరత్నం మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది. మణిరత్నం దర్శకత్వంలో కార్తీ - కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్ - నిత్యీమీనన్ జంటగా తమిళ మలయాళ భాషల్లో ఒక సినిమా రూపొందనున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే డేట్స్ కుదరని కారణంగా ఆయన ఆ కథను పక్కన పెట్టేశాడని చెబుతున్నారు.

ఆ తరువాత ఆయన దుల్కర్ సల్మాన్ - నిత్యామీనన్ తో 'ఓకే బంగారం' సినిమాను హిందీలో తెరకెక్కించే ఆలోచనలో వున్నాడనే టాక్ వినిపించింది. అయితే తాజాగా ఆయన కార్తీ హీరోగా ఒక సినిమాను తమిళ్లో రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో కార్తీకి జోడీగా నిత్యామీనన్ ను ఎంపిక చేశాడని అంటున్నారు. కార్తీ డేట్స్ తీసుకోవడం కూడా జరిగిపోయిందనీ, ఏప్రిల్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని చెబుతున్నారు. మరి ఈ జోడీ తెరపై ఎలాంటి సందడి చేస్తుందో.. ఈ సినిమాతో మణిరత్నం ఎలాంటి హిట్ కోడతాడో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)