ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహేశ్ బాబుతో మల్టీ స్టారర్!

Sat, Dec 12, 2015
మహేశ్ బాబు
మహేశ్ బాబు
అవును, మహేశ్ బాబుతో మల్టీస్టారర్ మూవీ తీసే ఆలోచన ఉందని దర్శకుడు పూరి జగన్నాథ్ చెప్పాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుందని అన్నాడు. మహేశ్ బాబుతో పాటు ఒక హాలీవుడ్ నటుడు ఈ సినిమాలో నటించే అవకాశం వుందని చెప్పాడు. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని అన్నాడు. మహేశ్ బాబు వరుస సినిమాలతో బిజీగా వున్నాడు కనుక, ఈ ప్రాజెక్టు కొంచెం సమయం తీసుకోవచ్చని చెప్పాడు.

గతంలో మహేశ్ కథానాయకుడిగా ఆయన పోకిరి .. బిజినెస్ మేన్ సినిమాలను తెరకెక్కించాడు. ఈ రెండు సినిమాలు ఒక ట్రెండ్ సృష్టించాయి. మహేశ్ కెరియర్లో మైలు రాళ్లుగా ఈ సినిమాలు కనిపిస్తాయి. అందువలన మహేశ్ - పూరి కాంబినేషన్ అంటేనే అందరిలో ఆసక్తి మొదలవుతోంది. మరీ ఈ భారీ మల్టీస్టారర్ తో ఈ ఇద్దరూ హ్యాట్రిక్ కొడతారేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.159.239.251
Movie News (Latest)