ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చిరూను మెప్పిస్తానంటోన్న పూరి!

Sat, Dec 12, 2015
పూరి జగన్నాథ్
పూరి జగన్నాథ్
చిరంజీవి 150వ సినిమా అనే కాదు .. ఆయన ఓకే అంటే ఆ తరువాత సినిమాను చేయడానికి కూడా తాను సిద్ధంగా వున్నానని పూరి జగన్నాథ్ అన్నాడు. ఈ నెల 17న 'లోఫర్' సినిమా విడుదల కానుండటంతో, ఆ సినిమా గురించి మాట్లాడుతూ ఆయన ఈ విషయం చెప్పాడు. చిరంజీవి 150వ సినిమాకి దర్శకుడిగా ముందుగా పూరి పేరు వినిపించడం, ఆయన వినిపించిన కథలో సెకండాఫ్ నచ్చలేదని చిరంజీవి చెప్పడం జరిగింది. అయితే ఆ విషయం తనతో నేరుగా చెబితే ఆ కథను మార్చేవాడినని పూరి అన్నాడు.

ఆ తరువాత ఈ సినిమాకి సంబంధించి పూరి ప్రస్తావన ఎక్కడా రాలేదు. ఈ నేపథ్యంలో చిరూ 150వ సినిమా కోసం పోటీపడుతోన్న దర్శకులలో మీరు వున్నారా? అనే ప్రశ్నకి ఆయన తనదైన శైలిలో స్పందించాడు. చిరంజీవికి ఎన్ని కథలను చెప్పయినా ఒప్పించడానికి తాను సిద్ధంగా వున్నాననీ, 150వ సినిమా అనే కాదు .. ఆ తరువాత సినిమానైనా చేస్తానని అన్నాడు. తానే కాదు ఆయనని డైరెక్ట్ చేయడానికి ఎవరైనా ఆసక్తిని చూపిస్తారని చెప్పుకొచ్చాడు.
X

Feedback Form

Your IP address: 54.159.239.251
Movie News (Latest)