ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పూరితో సినిమాపై అఖిల్ రియాక్షన్!

Sat, Dec 12, 2015
అఖిల్
అఖిల్
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తన రెండవ సినిమా రూపొందనుందనే వార్తల్లో నిజం లేదని అఖిల్ చెప్పాడు. కొన్ని రోజులుగా వస్తోన్న ఈ వార్తలపై స్పందిస్తూ ఆయన ఇలా క్లారిటీ ఇచ్చాడు. అఖిల్ తన రెండో సినిమాను త్రివిక్రమ్ తో గానీ .. కొరటాలతో గాని చేయాలనుకున్నాడనీ, వాళ్లు ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో పూరిపై దృష్టి పెట్టాడనే వార్తలు షికారు చేస్తున్నాయి.

దాంతో 'లోఫర్' హిట్ అయితే .. 'రోగ్' తరువాత పూరితో అఖిల్ సినిమా ఉండవచ్చనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ వార్తల పట్ల అఖిల్ స్పందిస్తూ .. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనేం లేదని చెప్పాడు. ఈ విషయంపై ఇంతవరకూ వచ్చిన వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని అన్నాడు. ప్రస్తుతం తాను మంచి కథను ఎంచుకునే పనిలో ఉన్నాననీ, అంతా పకడ్బందీగా వుందని అనుకున్నప్పుడు తాను తప్పకుండా తెలియజేస్తానని చెప్పుకొచ్చాడు.
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)