ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'సరైనోడు' స్పీడుమీదున్నాడు!

Sat, Dec 12, 2015
అల్లు అర్జున్
అల్లు అర్జున్
'సరైనోడు' మంచి స్పీడుమీదున్నాడు .. ఈ సినిమా షూటింగుకి సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఈ నెల 16 నుంచి హైదరాబాదులో తాజా షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ దృశ్యాలతో పాటు, మరికొన్ని కీలకమైన సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. 16 నుంచి మొదలయ్యే షెడ్యూల్లోను ప్రధాన పాత్రలకి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది.

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. అల్లు అర్జున్ సరసన కథానాయికలుగా రకుల్ .. కేథరిన్ కనువిందు చేయనున్నారు. బోయపాటి యాక్షన్ మార్క్ .. అల్లు అర్జున్ స్టైల్ ఎలా మిక్స్ అయ్యాయో చూసేందుకు యూత్ ఆసక్తి చూపుతోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాను ఏప్రిల్ 8న విడుదల చేయనున్నారు.
X

Feedback Form

Your IP address: 54.204.104.71
Movie News (Latest)