ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఇళయరాజాకు అరుదైన పురస్కారం!

Fri, Dec 11, 2015
ఇళయరాజా
ఇళయరాజా
సంగీత దర్శకుడు ఇళయరాజాకు మరో అరుదైన పురస్కారం లభించింది. ఒక ఆస్ట్రేలియా సినిమాకు సంబంధించి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఆయనకి ఈ పురస్కారం దక్కింది. ఆస్ట్రేలియాకు చెందిన జూలియన్ కరిగాలన్ దర్శకుడిగా పరిచయమవుతూ, 'లవ్ అండ్ లవ్ ఓన్లీ' అనే సినిమాను తెరకెక్కించాడు. ఒక పంజాబీ యువకుడు పనికోసం ఆస్ట్రేలియా వెళ్లి అక్కడ ఒక అమ్మాయితో ప్రేమలో పడటం అనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది.

జూలియన్ పూర్వీకులు మధురైకి చెందినవారు కావడంతో, వాళ్లకి ఇళయరాజా సంగీత సామర్థ్యం గురించి తెలుసు. అందువలన జూలియన్ ఈ సినిమా గురించి ఇళయరాజాను కలిసి, ఆయనతో బాణీలు కట్టించుకున్నాడు. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా చిత్రోత్సవంలో ఈ సినిమాను ప్రదర్శించారు. ఈ ప్రేమకథకు ఇళయరాజా కంపోజ్ చేసిన పాటలు మంత్రముగ్ధులను చేయడంతో, ఉత్తమ సంగీత దర్శకుడిగా ఆయనకి పురస్కారాన్ని ప్రకటించారు.
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)