ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మళ్లీ సమంతాకే ఛాన్స్!

Fri, Dec 11, 2015
సమంతా
సమంతా
త్రివిక్రమ్ దర్శకత్వంలో త్వరలో రూపొందనున్న సినిమాలో కథానాయికగా మళ్లీ సమంతాకే ఛాన్స్ లభించనుందనే వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. నితిన్ కథానాయకుడిగా ప్రస్తుతం త్రివిక్రమ్ 'అ .. ఆ' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన సూర్యతో ఒక సినిమాను చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. తెలుగు .. తమిళ భాషల్లో రూపొందనున్న ఈ సినిమాలో, కథానాయికగా మళ్లీ సమంతానే తీసుకునే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు.

గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో అత్తారింటికి దారేది .. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలలో నటించిన సమంతా, ప్రస్తుతం ఆయన దర్శకత్వంలోనే 'అ .. ఆ' మూవీలోను చేస్తోంది. ఇక ఆయన నెక్స్ట్ ప్రాజెక్టులోను ఆమెనే కథానాయిక కానుందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. అదే నిజమైతే త్రివిక్రమ్ దర్శకత్వంలో సమంతాకి ఇది నాల్గొవ సినిమా కాగా, సూర్య కాంబినేషన్లో ఆమెకి మూడవ సినిమా అవుతుంది.
X

Feedback Form

Your IP address: 54.197.142.219
Movie News (Latest)