ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మరో ఛాన్స్ దక్కించుకున్న సోనారిక!

Thu, Dec 10, 2015
సోనారిక
సోనారిక
బుల్లితెర కథానాయికగా అశేష ప్రేక్షకులను అలరించిన సోనారిక, 'జాదూగాడు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ప్రస్తుతం మంచు విష్ణు జోడీగా 'సరదా' సినిమాలో చేస్తోన్న ఆమె, అతని తదుపరి సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసినట్టుగా తెలుస్తోంది. జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఒక మల్టీస్టారర్ సినిమా కోసం, ఆమెను ఎంపిక చేశారట.

'సోనారిక' మొదటి సినిమా ఫ్లాప్ అయినా, ఆమె అందచందాలు .. అభినయం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దాంతో విష్ణు కథానాయకుడిగా చేస్తోన్న 'సరదా' సినిమాలో అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో విష్ణు మరో సినిమాకు ఓకే చెప్పాడు. ఈ సినిమాలో ఆయన జోడీగా ముందు అమైరా దస్తూర్ ను అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఆమె స్థానంలో మళ్లీ సోనారికను తీసుకున్నారు. దీనిని బట్టి సోనారిక కూడా స్పీడ్ పెంచుతోందని అనుకోవచ్చు.
X

Feedback Form

Your IP address: 54.146.141.60
Movie News (Latest)