ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అర్జున్ దర్శకత్వంలో కూతురే హీరోయిన్!

Thu, Dec 10, 2015
ఐశ్వర్య
ఐశ్వర్య
తెలుగు .. తమిళ భాషల్లో యాక్షన్ హీరోగా సీనియర్ నటుడు అర్జున్ కి మంచి పేరు వుంది. ఆయనకి నటనపైనే కాకుండా కథ .. స్క్రీన్ ప్లే .. దర్శకత్వం పైన కూడా మంచి పట్టు వుంది. ఆయన కూతురు ఐశ్వర్య తమిళ్లో కథానాయికగా ఎదగడానికి తనవంతు ప్రయత్నం చేస్తోంది. తండ్రి దర్శకత్వంలో కూతురు ఐశ్వర్య ఒక కన్నడ సినిమాను చేయనుందనే వార్తలు కొంతకాలంగా శాండల్ వుడ్లో వినిపిస్తున్నాయి.

అది నిజమేనని తాజాగా ఐశ్వర్య ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. కన్నడలో తాను కథానాయికగా పరిచయం కానున్న ఈ సినిమాలో చేతన్ హీరోగా నటిస్తాడని అంది. కన్నడతో పాటు తమిళ్లోను ఏకకాలంలో రూపొందే ఈ సినిమాకి తన తండ్రి అర్జున్ దర్శకుడిగా వ్యవహరిస్తాడని ఆమె స్పష్టం చేసింది. ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుందనీ, అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుందని చెప్పుకొచ్చింది.
X

Feedback Form

Your IP address: 54.166.5.76
Movie News (Latest)