ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అఖిల్ రెండవ సినిమా పూరితో?

Thu, Dec 10, 2015
అఖిల్
అఖిల్
అఖిల్ రెండవ సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వుండనుందా అనే సందేహానికి, ఆ అవకాశం లేకపోలేదనే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం అఖిల్ చూపు పూరి పైన వుందని అంటున్నారు. ఆయన దర్శకత్వం వహించిన 'లోఫర్' రిజల్ట్ ను బట్టి, ఈ విషయంలో నిర్ణయం తీసుకుందామనే ఆలోచన చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. తన మొదటి సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, రెండవ సినిమాను బ్లాక్ బస్టర్ చేసే దర్శకుడు కావాలని అఖిల్ భావిస్తున్నాడు.

అయితే ఆయన ఆసక్తి చూపిన త్రివిక్రమ్ .. కొరటాల ఇద్దరూ ఇతర ప్రాజెక్టులతో బిజీగా వున్నారు. ఇక పూరి మాత్రం 'లోఫర్'ను రిలీజ్ కి రెడీ చేసి, 'రోగ్' సినిమా పనిలో వున్నాడు. 'లోఫర్' సినిమా పోస్టర్స్ వలన .. టీజర్ వలన ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా హిట్ అయితే పూరితో సినిమా చేయాలనే నిర్ణయానికి అఖిల్ వస్తాడని అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.
X

Feedback Form

Your IP address: 54.147.211.117
Movie News (Latest)