ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆ జోడీకున్న క్రేజ్ అలాంటిది!

Tue, Dec 08, 2015
షారుఖ్ ఖాన్
షారుఖ్ ఖాన్
బాలీవుడ్ కి సంబంధించిన హిట్ పెయిర్స్ లో షారుఖ్ ఖాన్ - కాజోల్ ముందు వరుసలో కనిపిస్తారు. 'బాజీగర్' సినిమా కోసం తొలిసారిగా జోడీకట్టిన ఈ జంట .. ప్రేక్షకులకు కనులపంట చేసింది. అలా ఈ జంట ఆరు చిత్రాల్లో నటించింది. ఈ సినిమాల్లో 'దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే' ప్రత్యేకమైన స్థానంలో కనిపిస్తుంది. ఇప్పుడీ జంట చాలా కాలం తర్వాత 'దిల్ వాలే' చిత్రంలో నటించింది.

రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై షారుఖ్ ఖాన్ భార్య ఈ సినిమాను నిర్మించింది. రోహిత్ శెట్టి దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమా, ఈ నెల 18న విడుదల కానుంది. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా, శాటిలైట్ రైట్స్ పరంగా 60 కోట్లను .. ఆడియో రైట్స్ పరంగా 19 కోట్లను రాబట్టింది. క్రితం నెల 9వ తేదీన విడుదలైన ఈ సినిమా టీజర్ కు ఒక కోటి డెబ్భై లక్షల హిట్స్ లభించాయి. దీనిని బట్టి ఈ సినిమాపై ఆడియన్స్ లో ఎంత క్రేజ్ వుందో అర్థం చేసుకోవచ్చు.
X

Feedback Form

Your IP address: 54.146.141.60
Movie News (Latest)