ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'చోటామేస్త్రీ'గా చరణ్?

Tue, Dec 08, 2015
చరణ్
చరణ్
సంపత్ నంది దర్శకత్వంలో చరణ్ 'చోటామేస్త్రీ'గా కనిపించే అవకాశం ఉందనే టాక్ తాజాగా ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. తాను చరణ్ కోసం ఒక మంచి కథను రెడీ చేసినట్టుగా గతంలోనే సంపత్ నంది చెప్పాడు. కానీ ఎవరికివారు ఇతర ప్రాజెక్టులతో బిజీగా వుండటం వలన, సమయం వచ్చినప్పుడు చేద్దామని ఈ కథను పక్కన పెట్టేశాడు. ఆ సమయం ఇప్పుడు వచ్చిందని ఆయన భావిస్తున్నాడట.

స్క్రిప్టును సిద్ధం చేసిన సంపత్ నంది త్వరలో దానిని చరణ్ కి వినిపించడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన ఓకే అంటే వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లాలనే ఆలోచనలో వున్నాడు. గతంలో సంపత్ 'రచ్చ' హిట్ తో చరణ్ లో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చాడు. అందువలన సంపత్ నంది కాంబినేషన్లో చరణ్ చేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి మరి.
X

Feedback Form

Your IP address: 54.161.128.52
Movie News (Latest)