ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

యూఎస్ లో భారీగా 'బెంగాల్ టైగర్' రిలీజ్

Tue, Dec 08, 2015
రవితేజ - తమన్నా
రవితేజ - తమన్నా
తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లోను 'బెంగాల్ టైగర్' భారీస్థాయిలో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఒక్క యూఎస్ లోనే ఈ సినిమాను 100 స్క్రీన్స్ కు పైగా విడుదల చేస్తుండటం విశేషం. ఈ సినిమాకు ఇప్పటివరకూ వచ్చిన క్రేజ్ రీత్యా, తెలుగు రాష్ట్రాలతో పాటు, యూఎస్ లోను భారీ ఓపెనింగ్స్ ఉంటాయని అనుకుంటున్నారు. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, రవితేజ సరసన తమన్నా - రాశీఖన్నా కథానాయికలుగా సందడి చేయనున్నారు.

రాధామోహన్ నిర్మాణంలోని భారీతనం పోస్టర్స్ లోను .. టీజర్లోను కనిపిస్తూనే వుంది. 'కిక్ 2' తరువాత వస్తోన్న సినిమా కనుక రవితేజ, ఇక నుంచి స్టార్ హీరోలతోనే వరుసగా సినిమాలు చేయాలనే పట్టుదలతో సంపత్ నంది .. ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధపెట్టారు. రవితేజ నుంచి మాస్ ఆడియన్స్ ఆశించే అంశాలు, తమన్నా - రాశీఖన్నా నుంచి ఆశించే గ్లామర్ విషయంలోనూ సంపత్ నంది దృష్టిపెట్టాడు. అందువలన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో సంతృప్తిని కలిగించడం ఖాయమనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.204.130.177
Movie News (Latest)